టిక్‌టాక్ కోసం సాఫ్ట్‌బ్యాంక్ ప్రయత్నాలు

by Anukaran |
టిక్‌టాక్ కోసం సాఫ్ట్‌బ్యాంక్ ప్రయత్నాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా అన్ని దేశాల్లో చిక్కులను ఎదుర్కొంటున్న చైనా యాప్ టిక్‌టాక్ (TIK TOK) కార్యకలాపాలను కొనేందుకు అనేక దిగ్గజ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా కార్యకలాపాలను దక్కించుకోవడానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రయత్నిస్తుండగా, భారత కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ (Reliance) చర్చలు ప్రారంభించినట్టు వార్తలు వినిపించాయి.

తాజాగా, టిక్‌టాక్ ఇండియా కార్యకలాపాలను దక్కించుకోవడానికి సాఫ్ట్‌బ్యాంక్ (Softbank) కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. టిక్‌టాక్‌తో పాటు వందల్లో చైనాకు చెందిన యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం భద్రతా కారణాలతో కార్యకలాపాలను ఎత్తేయాలని, లేదంటే అమెరికా కంపెనీకి విక్రయించాలని గడువు విధించారు. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ (ByteDance) వాటాలను విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టీంది. దీనికి అవసరమైన భాగస్వాముల కోసం చర్చలు నిర్వహిస్తోంది.

కాగా, ఇప్పటికే బైట్‌డ్యాన్స్‌ (ByteDance)లో మైనారిటీ వాటాను కలిగిన సాఫ్ట్‌బ్యాంక్ టిక్‌టాక్ ఇండియా (Tik Tok India) కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. స్థానిక భాగస్వాముల కోసం సాఫ్ట్‌బ్యాంక్ ప్రయత్నిస్తోంది. టిక్‌టాక్ ఇండియా ఆస్తులను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ అధిపతులతో సహా బిడ్డర్ల బృందంతో సాఫ్ట్‌బ్యాంకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed