బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు

by Mahesh |
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Mallareddy,), ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి (MLA Rajasekhar Reddy) చుట్టూ ఎన్నో వివాదాలు తిరుగుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్‌కు ఊహించని షాక్ తగిలింది. డబ్బులు చెల్లింపు విషయంలో తమను మోసం చేశాడని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించగా.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు (FIR has been registered.). దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ (Vision Property Management Service) అనే సంస్థతో ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డికి చెందిన అరుంధతి హాస్సిటల్స్ (Arundhati Hospitals) కలిసి పని చేసింది. ఆ సమయంలో అరుంధతి హాస్పిటల్‌కు 40 మంది సిబ్బందిని విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ నుంచి కేటాయించాలని యేసు బాబు, రాజశేఖర్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు.

40 మంది సిబ్బందికి రూ. 50 లక్షలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అంగీకరించారు. దీంతో యేసుబాబు అరుంధతి ఆస్పత్రిలో విజన్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ కు చెందిన 40 మంది సిబ్బందిని కేటాయించారు. ఇదిలా ఉండగా 40 మందికి ఇవ్వాల్సిన 50 లక్షల రూపాయలు విడతల వారీగా ఇప్పటి వరకు రూ. 30 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ. 20 లక్షల కోసం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని ఆడిగితే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. యేసు బాబు పోలీసులను ఆశ్రయించి రాజశేఖర్ రెడ్డినై బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు యేసు బాబు ఫిర్యాదు మేరకు 316/2, 318(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed