- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
AP Govt.: బాణాసంచా తయారీ కేంద్రాలపై కొరవడిన నిఘా.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి జిల్లా కోటవురట్ల (Kotavuratla) మండలం కైలాసపట్నం (Kailasapatnam) బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులు నర్సిపట్నం (Narsipatnam) ఆసుపత్రితో పాటు కేజీహెచ్ (KGH)లో చికిత్స పొందుతున్నారు. అయితే, బాణాసంచా తయారీ కేంద్రాలపై నిఘా కొరవడిన వేళ కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కైలాసపట్నంలో జరిగిన ప్రమాదాన్ని సీఎం చంద్రబాబు (CM Chandrababu) సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా తయారీ కేంద్రాల్లో సెఫ్టీ ఆడిట్ (Safety Audit) చేయించాలని నిర్ణయం తీసుకున్నారు.
వీలైనంత త్వరగా పరిహారం అందజేస్తాం.. హోంమంత్రి
అనకాపల్లి ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) మరోసారి స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిందని పేర్కొన్నారు. రౌండ్ ది క్లాక్ అధికారులు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారని తెలిపారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిందని అన్నారు. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాలకు పరిహారం అందజేస్తామని వెల్లడించారు. అదేవిధంగా ఎల్జీ పాలిమర్స్ (LG Polymers) ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలపై త్వరలోనే విచారణ జరిపిస్తామని హోంమంత్రి అనిత అన్నారు.