షాకింగ్: మహిళ నోట్లో దూరిన పాము (వీడియో)

by vinod kumar |   ( Updated:2023-03-24 18:21:42.0  )
షాకింగ్: మహిళ నోట్లో దూరిన పాము (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కొందరు నోరు తెరచి నిద్ర పోతుంటారు. ఆ సమయంలో వారికి తెలియకుండానే నోట్లోకి ఈగలు, దోమలు వెళ్లడం తెలిసిన విషయమే. కానీ రష్యాలోని డజెస్థాన్‌ ప్రాంతంలోని లెవాషి గ్రామానికి చెందిన యువతి అలా నిద్రపోతుండగా ఆమెకు తెలియకుండానే ఆమె నోట్లోకి ఏకంగా నాలుగు అడుగుల పొడవున్న పాము వెళ్లింది.

పొద్దున లేచేసరికి ఆమెకు కడుపులో ఏదో తిరుగుతున్నట్టు, కడుపంతా తిప్పుతున్నట్లు అనిపించి సమీపంలోని ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్య సిబ్బంది ఆమె కడుపును స్కాన్‌ చేయగా, కడుపులో ఏదో పాములాంటి జీవి ఏదో ఉన్నట్లు కనిపించింది. ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లాక ఓ డాక్టర్‌ ఆమె నోట్లోకి పైపును పంపించి వినూత్న పద్ధతిలో ఆపరేషన్‌ చేశారు.

పైపుతోపాటు బయటకు వచ్చిన పాము కొసను పట్టుకొని ఓ నర్సు భయంతో ఆ పామును బయటకు లాగేసింది. ఆ పామును వైద్య చెత్త పడేసే బకెట్లో వేశారు. బాధితురాలి పేరునుగానీ, ఆమె కడుపు లోపలికి దూరింది ఎలాంటి రకమైన పామో వైద్యులు చెప్పలేదు.

ఈ అరుదైన ఆపరేషన్‌ను వీడియోలో చిత్రీకరించిన ఆ ఆస్పత్రి సిబ్బంది, ఆ తర్వాత దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వీడియో కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి.

Advertisement

Next Story

Most Viewed