- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె ‘స్మృతి’ పథంలో 80ల నాటి జ్ఞాపకాలు
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ రాజకీయాల్లో కూలెస్ట్ మినిస్టర్ ఎవరంటే.. గుర్తుకు వచ్చే పేర్లలో స్మృతి ఇరానికి తప్పక స్థానం ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ, త్రోబ్యాక్ మెమోరీస్, మీమ్స్ వంటివి పోస్ట్ చేయడంలో చాలా యాక్టివ్‌గా ఉంటారు స్మృతి. అందుకే ఇన్‌స్టాలో ఆమె చేసే పోస్టులకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉంటారు. 80 – 90ల నాటి కాలానికి సంబంధించిన కొన్ని ఫొటోలను స్మృతి ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు.
కరోనా నేపథ్యంలో…
కాలంతో పరుగులు తీస్తున్న మానవాళిని.. కరోనా.. ఒక్కసారిగా బ్రేకులు వేసి ఆపేసింది. ఎవరూ గడప దాటి రావడం లేదు. ఎన్నాళ్ల నుంచో తీరిక లేకుండా గడిపిన ఎందరికో.. కాస్త విశ్రాంతి దొరికింది. రెక్కలు కట్టుకుని వెళ్లిన అందరూ ఒక గూటికి చేరారు. కుటుంబంతో కలిసి ఎన్నో జ్ఞాపకాలను, సరదా సంగతలను నెమరు వేసుకుంటున్నారు. టీవీల్లో రామాయణం వస్తుంటే.. ఈ సీరియల్ మొదలైన కాలం నాటి ముచ్చట్లను పంచుకుంటున్నారు. అలా ఇంకెన్నో సంగతులను తమ తర్వాతి తరంతో షేర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్మృతి ఇరానీ కూడా కొన్ని ఫోటోలతో 80-90ల నాటి బాల్యానికి తీసుకెళ్లారు.
‘కిస్కో యాద్ హై?’
స్కూల్ వెళ్లే.. ప్రతి ఒక్కరూ విధిగా ‘షూ’స్ వేసుకోవాలి. ఈ రూల్ ఇప్పటిదీ కాదు.. ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇప్పుడు రకరకాల, రంగురంగుల షూ వాడుతున్నారు. ఓ నలభై సంవత్సరాల అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. స్కూల్ పిల్లలంతా వైట్ షూ ధరించే వాళ్లు. రోజూ అవి కొత్తగా కనిపించడానికి, మిలమిల మెరిసిపోవడానికి పాలిష్ కూడా చేసేవారు. ఎంతోమందికి గుర్తుకు వచ్చే ఉంటుంది. రాకపోతే.. స్మృతి ఇరానీ పెట్టిన ఫోటో చూస్తే.. జ్ఞాపకం రావచ్చు. అందుకు ఆ ఫోటోతో స్మృతి ‘కిస్కో యాద్ హై?’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ల్యాండ్ లైన్ ఫోన్ :
ఇప్పుడంటే.. అందరి చేతుల్లో సెల్ ఫోన్లున్నాయి. కానీ 80 లో ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటే.. శ్రీమంతుల కిందే లెక్క కట్టే వాళ్లు. వీధిలో ఒకరింట్లో ఫోన్ ఉంటే.. ఆ చుట్టుపక్కల వాల్లందరూ వాళ్ల చుట్టాలందరికీ అదే నెంబర్ ఇచ్చే వాళ్లంటే అతిశయోక్తి కాదేమో. అయితే ఒక్కోసారి ఇన్ కమింగ్ కాల్స్ కూడా ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమయంలో ఫోన్ రాకుండా ఉండాలంటే.. రిసీవర్‌ని పక్కన పెట్టేస్తే చాలు. ఎంత మొత్తుకున్నా ఫోన్ రాదు. సరదాగా ఏడిపించడానికి కూడా అలా చేసేవాళ్లు. స్మృతి ఇదే జ్ఞాపకాన్ని గుర్తుచేస్తోంది. దానికి జతగా ‘హౌ వి బ్లాక్డ్ పీపుల్ ఇన్ 1980’ అని క్యాప్షన్ ఇచ్చింది.
క్యాసెట్ ను చుట్టేసిన రీల్
సినిమా పాటలు వినడానికి మొన్నటి వరకు సీడీ, డీవీలు ఉండేవి. ఆ తర్వాత పెన్ డ్రైవ్ లు.. అటు తర్వాత మెమొరీ కార్డ్ లు.. ఇప్పుడు అవన్నీ పోయి.. డైరెక్ట్‌గా సెల్‌ఫోన్ సాయంతో ఆన్ లైన్ లోనే వినేంత సౌలభ్యం వచ్చింది. కానీ, అప్పట్లో టేప్ రికార్డ్ లో క్యాసెట్ వేసుకుని సంగీతాన్ని ఆస్వాదించేవాళ్లు. ఎంతో ఇష్టపడి.. క్యాసెట్ లో పాటలు నింపుకుని వచ్చి.. వినే సమయానికి దాంట్లోని రీల్ చుట్టేస్తే… ఆ బాధ మాటల్లో చెప్పలేం. స్మృతి అదే చెబుతోంది. ‘క్యాసెట్ ను చుట్టేసిన రీల్ పై.. ద యూత్ ఆఫ్ టుడే విల్ నెవర్ నో అవర్ స్ట్రగుల్’ అంటూ రాసుకొచ్చింది.
ఇప్పుడు కార్ విండో తీయాలంటే.. రిమోట్ తో ఒక నొక్కు నొక్కితే చాలు.. కానీ అప్పట్లో కార్ విండో తీయాలంటే.. కొంచెం శ్రమ పడాల్సి వచ్చేది. ఆ సంగతి కూడా ఫోటో గా షేర్ చేసింది స్మృతి. సో ఇవే కాదు.. అప్పట్లో ఆడిన ఆటలు, సైకిల్ పోటీలు, బెల్ బ్యాటం పైంట్లు, కలర్ సోడా రుచులు.. ఇలా ఇంకెన్నో గుర్తులు ఉంటాయి. క్యారంటైన్ వేళ… హాయిగా ఓ సారి ఆ రోజుల్లోకి వెళ్లి వచ్చేయండి. మనసుకు చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంటుంది.
Tags : smrithi irani, minister, childwood, instagram