పాఠశాలకు నడిచేది ఎలా .. కలెక్టర్ చెప్పినా పట్టించుకోరా

by Aamani |   ( Updated:2021-08-28 04:26:04.0  )
పాఠశాలకు నడిచేది ఎలా .. కలెక్టర్ చెప్పినా పట్టించుకోరా
X

దిశ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధాన గేటు వద్ద కురిసిన వర్షానికి బురదమయంగా మారింది. ఉర్దూ మీడియం, ప్రాథమిక ఉన్నత పాఠశాల, బాలుర పాఠశాల, విద్యా వనరుల కేంద్రం‌తో పాటు అంగన్వాడి కేంద్రం కూడా కలదు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ప్రధాన గేటు వద్ద బురదమయం‌గా మారింది. గేటు వద్ద బురద కావడంతో తల్లిదండ్రులు విద్యార్థులు ఎలా వెళతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 1వ తారీఖున పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయినా ఇప్పటికీ ప్రధాన గేటు కూడా మరమ్మత్తు చేయలేని ఉపాధ్యాయులు పాఠశాలను ఎలా శుభ్రం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. కరోనా మహమ్మారి శివతాండవం చేయడం వలన విద్యార్థులను రెండు సంవత్సరాలుగా పాఠశాలకు పంపించలేక పోయామని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రస్తుతం పాఠశాలలను సానిటేషన్ పకడ్బందీగా చేయాలని స్వయానా జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నప్పటికీ, అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడం బాధాకరం. పాఠశాలలకు వెళ్లే దారి అద్వానంగా ఉండడం, గుంతలు ఏర్పడడంతో, వాటిలో నీరు నిండి దోమలు వ్యాప్తి చెంది డెంగీ, మలేరియా, టైపైడ్, కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మొద్దు నిద్ర‌లో ఉండటం శోచనీయం. ఇకనైనా అధికారులు పాఠశాలలకు వెళ్లే దారిని బాగు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed