మొక్కలు నాటిన టీఎస్ ఐఐసీ ఛైర్మన్

by Shyam |
మొక్కలు నాటిన టీఎస్ ఐఐసీ ఛైర్మన్
X

దిశ, న్యూస్‌బ్యూరో: చర్లపల్లి పారిశ్రామికవాడలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని గురువారం టీఎస్ ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు మొక్కలు నాటి ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్ రెడ్డి‌లు కూడా మొక్కలు నాటారు. టీఎస్ ఐఐసీ చీఫ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, జోనల్ మేనేజర్ మాధవి, చర్లపల్లి పారిశ్రామిక వాడ అసోసియేషన్ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.


👉 Read Disha Special stories


Next Story