- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆరుగురు జీవిత ఖైదీలు విడుదల
by Shyam |

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కారాగారం నుంచి గురువారం ఆరుగురు జీవిత ఖైదీలను జిల్లా జైలు అధికారులు విడుదల చేశారు. ప్రతి ఏడాది గాంధీ జయంతి రోజున సత్‌ప్రవర్తన కలిగిన ఖైదీలను జీవో నెంబర్ 31ను అనుసరించి విడుదల చేయడం అనవాయితీగా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ఖైదీలు ఈ సంవత్సరం విడుదల చేయగా, నిజామాబాద్ జైలు నుంచి ఆరుగురికి అవకాశం దక్కింది.
ఈసారి ఆక్టోబర్ 2న నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ ఉండటంతో వారిని విడుదల చేయడం వీలు కాలేదు. ఎన్నికల ముగిసి కోడ్ పూర్తి అయిన తరువాత జిల్లా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తూ… సత్ప్రవర్తన కలిగిన వారిని గురువారం విడుదల చేసినట్లు జైలు సూపరింటెండెంట్ ప్రమోద్ తెలిపారు.
Next Story