- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కబ్జా కోరల్లో ప్రభుత్వ పాఠశాల.. హరితవనం పేరుతో సర్పంచ్ ఇష్టారాజ్యం
దిశ, నాగర్‌కర్నూల్: జిల్లా తాడూరు మండల పరిధిలోని సిర్సావాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రామ సర్పంచ్ పాఠశాల అనుమతి లేకుండా కబ్జా చేసినట్లు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. 1972 సంవత్సరంలో గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి తనకున్న 265 సర్వే నెంబర్ పొలంలో నుంచి రెండు ఎకరాలు దాన పూర్వకంగా రాసి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అందులో గ్రామ సర్పంచ్ రాజేందర్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయునికి ఎలాంటి సమాచారం లేకుండా పల్లె ప్రకృతి వనం పేరుతో కబ్జా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో విద్యార్థులకు ఆటస్థలం కరువైందన్నారు. ఇతర విష సర్పాలు సంచరించే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఒక పక్క ఆటలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని చెబుతుంటుంది. కానీ మరో పక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ప్రభుత్వ పాఠశాలను కబ్జా చేయడమేంటనీ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు పూర్వ విద్యార్థులు కోరుతున్నారు.