ఆ ‘సార్’ఎవరు సార్..?

by Shyam |
ఆ ‘సార్’ఎవరు సార్..?
X

సిరిసిల్ల హాస్టల్ బాలికలపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు చెప్పిన ఆ ‘సార్’ఎవరని ప్రజా సంఘాలు సూటిగా ప్రశ్నించాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం నిరాహార దీక్ష
జరిగింది. స్టూడెంట్ యూనియన్లు బీఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, డిఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, టీఎస్‌యు, ఎన్ఎస్‌యూఐ అండ్ కుల, ప్రజా సంఘాలు ఎంఆర్‌పీఎస్, మాలమహానాడు, బిసి సంక్షేమ సంఘం, లంబాడీల ఐక్య వేదిక, దళిత సంఘాలు, పొలిటికల్ పార్టీలు కాంగ్రెస్, టిడిపి, బిఎస్‌పి,
సీపీఐ, సీపీఐ(ఎం), వైఎస్‌ఆర్‌సీపీ, బిజేపిల సంయుక్త నాయకత్వం పేరిట నిరాహార దీక్ష శిబిరం వద్ద ఫ్లెక్సీ వెలిసింది. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థినుల పట్ల వేధింపుల కేసుపై సిటింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హాస్టల్‌కు సకల సదుపాయాలతో పక్కా భవనాన్ని కట్టించాలని కోరారు. తగిన భద్రత కల్పించాలని సూచించారు. మెస్ పరంగా కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి, సర్కారే నిర్వహించాలన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసుల్నిసత్వరం ఎత్తివేయాలని పేర్కొన్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story