స్మితా గారు.. ఆ కుక్క ఎవరో చెప్తారా?

by Anukaran |   ( Updated:2021-04-20 04:50:27.0  )
స్మితా గారు.. ఆ కుక్క ఎవరో చెప్తారా?
X

దిశ, వెబ్ డెస్క్ : పాప్ సింగర్ స్మిత ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఆల్బమ్స్ కి సంబంధించిన అప్ డేట్స్ ని అభిమానులకు తెలుపుతూ ఉంటుంది. ఇక తాజాగా ట్విట్టర్ లో ఆమె పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ద్వారా రెండు వర్గాలు ట్విట్టర్ లో వార్ మొదలుపెట్టాయి. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే.. “ఏనుగు దారిన వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి” అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ ఎవరి గురుంచి చేసిందో మాత్రం చెప్పలేదు. అయితే ఈ ట్వీట్ ఖచ్చితంగా వైసీపీ నాయకులకే అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. స్మిత స్వతహాగా టీడీపీ అభిమాని. నేడు మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు కావడం .. ఆయన పుట్టిన రోజున వైసీపీ నేత విజయ్ సాయి రెడ్డి 420 అంటూ విమర్శలు చేయడంతో ఆగ్రహించిన స్మిత ఇలా ట్వీట్ చేసి ఉంటుందని నెటిజన్లు అంటున్నారు.

చంద్రబాబును ఏనుగుగా పోలుస్తూ… కుక్కలుగా వైసీపీ నాయకులను పోల్చిందని కామెంట్ల రూపంలో చెప్తున్నారు. ఇకపోతే ఈ ట్వీట్ కి ఇరు పార్టీ వర్గాల నాయకులు ఘాటు కామెంట్లనే చేస్తున్నారు. స్మితా గారు .. ఆ కుక్క ఎవరో చెప్తారా?, విజయ్ సాయి రెడ్డి ఈ కథలో కుక్క ఎవరో తెలుసా ? నువ్వు కాదులే దానితో పోల్చటానికి కూడ ఆ అర్హత కూడా లేదు నీకు.. అని కొందరు అంటుంటే.. మరికొందరు చంద్రబాబు చేసిన వాటికి అలా కాకపొతే ఎలా అంటారు? అని మరికొందరు ట్వీట్ వార్ నడుపుతున్నారు. అయితే ఈ విషయమై స్మిత స్పందించింది. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టింది కాదని, ఎప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసినా తనకు అలానే అనిపిస్తుందని చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా స్మిత ఒక్క ట్వీట్ తో రాజకీయ నాయకురాలిగా మారిపోయింది.

Advertisement

Next Story