- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
35.47లక్షల మొక్కలు నాటుతాం
దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన వృక్షారోపన్ అభియాన్‌తో కలిపి ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలు నాటుతున్నామని, గురువారం ఒక్కరోజే సింగరేణిలోని 11 ఏరియాల్లో 2 లక్షల మొక్కలు నాటినట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. వృక్షారోపన్ అభియాన్‌ను హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆయన మొక్క నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 804 హెక్టార్లలో 35.47 లక్షల మొక్కలు నాటుతున్నామని, ఇప్పటికే ఈ కార్యక్రమం కింద 11 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా బొగ్గు కంపెనీల్లో జరుగుతున్న వృక్షారోపన్ అభియాన్ కార్యక్రమాన్ని సింగరేణిలో కూడా అమలు చేస్తూ మొక్కలు నాటుతున్నామని వివరించారు. సింగరేణి సమీప గ్రామాల ప్రజలకు ఈ ఏడాది 2.5 లక్షల పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సింగరేణి సంస్థ ఇప్పటివరకు 11 ఏరియాల పరిధిలో 12,172 హెక్టార్లలో 5కోట్ల 40 లక్షల మొక్కలు నాటిందనీ, వీటిలో 75 శాతం పాదుకొని అడవులుగా పెరుగుతున్నాయని తెలిపారు. హరితహారం ప్రారంభం నుంచి 4 కోట్ల మొక్కలను సింగరేణి నాటిందని శ్రీధర్ పేర్కొన్నారు. 2015లో 40లక్షల మొక్కలు, 2016లో కోటి మొక్కలు, 2017లో కోటి మొక్కలు, 2018లో 90 లక్షల మొక్కలు, 2019లో 65లక్షల మొక్కలు నాటామని, ఈ ఏడాది 35 లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు.