- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైటెక్ సిటీ రేంజ్‌లో సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ సెంటర్: హోమ్ మినిస్టర్
దిశ సిద్దిపేట: దేశంలోనే నెంబర్ 1 పోలీస్ అంటే తెలంగాణనే ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సిద్దిపేట పట్టణంలో రూ.10 కోట్లతో నిర్మించిన మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, MLC ఫారూక్ హుస్సేన్, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర పోలీస్ సంక్షేమ , పోలీస్ కమిషనర్ డి జోయల్ డేవిస్ తో కలిసి రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవ, సహకారంతోనే మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ వేగంగా నిర్మాణం అయ్యిందన్నారు. ప్రతి జిల్లాలో సిద్దిపేట లాంటి మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కావాలన్నారు. దేశంలోనే నెంబర్ 1 పోలీస్ అంటే తెలంగాణనే ఉందని, ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ అంటే భయం ఉండేదని తెలంగాణ లో ఫ్రెండ్లీ పోలీస్ తో పోలీస్‌లకు గౌరవం పెరిగిందన్నారు. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేట హైటెక్ సిటీ తరహా అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టితో పోలీస్‌శాఖలో అనేక సంస్కరణలు అమలు చేసి దేశానికే ఆదర్శంగా పోలీస్ శాఖను తీర్చిదిద్దామన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుండటం వల్లే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆశీస్సులు, రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో పోలీసుల సంక్షేమంకు కృషి చేస్తామన్నారు. తెలంగాణ పోలీసులు తమ పనితీరుతో.. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. తెలంగాణ పోలీసులకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేసే శాఖ పోలీస్ శాఖకు ఏదైనా చేయాలనే ఆలోచన ఉండేదని అందులో భాగంగా నిర్మించిందే ఇది అన్నారు. నా కలల ప్రతిరూపమే మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ అని సీపీ జోయల్ డేవిస్ సారథ్యంలో నా కల సాకారం అయ్యిందన్నారు. మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ద్వారా వచ్చే ప్రతి రూపాయి పోలీస్‌ల సంక్షేమానికే వెచ్చిస్తామన్నారు. మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం వేగంగా కృషి చేసిన సీపీ జోయల్ డేవిస్, కాంట్రాక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సిద్దిపేట మోడల్ పోలీస్ కన్వెన్షన్ సెంటర్ తొలి అడుగు మాత్రమే అని ప్రతి జిల్లాలో ఇలాంటి సెంటర్ నిర్మిస్తామన్నారు. పోలీస్ శాఖకు మంజూరైన పెట్రోల్ బంక్ ల ఏర్పాటుకు అనువైన స్థలాలను త్వరలోనే గుర్తిస్తామన్నారు. పోలీస్ సంక్షేమ నిధికి మరిన్ని ఫండ్ జమ అయ్యేలా కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి తన్నీరు హరీష్ రావు ఆశీస్సులతో తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా సకల హంగులు, సౌకర్యాలతో అత్యంత సుందరంగా పోలీస్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించుకున్నామన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారని, తెలంగాణ ఏర్పాటైన వెంటనే పోలీస్ శాఖకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. సీఎం నమ్మకాన్ని నిలబెట్టి తెలంగాణలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పోలీస్ శాఖ కృషి చేసిందన్నారు. పోలీస్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కన్వెన్షన్ సెంటర్, పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక GO జారీ చేసిందన్నారు. పోలీస్ కన్వెన్షన్ సెంటర్, పెట్రోల్ బంక్‌ల ద్వారా పోలీస్ సంక్షేమానికి ఫండ్ జన రేట్ అవుతుందన్నారు. పోలీస్ సంక్షేమానికి ఆ నిధులను వెచ్చిస్తామని, ప్రతి జిల్లాలో సిద్దిపేట తరహా పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కావాలన్నారు. రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రత్యేక చొరవతో కోవిడ్ క్లిష్ట పరిస్థితులను అధికమించి వేగంగా పోలీస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించామన్నారు.