- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం’

దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ అన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మే 29 వరకు సడలించిన లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. బయటకు వచ్చే ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని, మాస్కులు లేకుండా వస్తే రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి, ఇతర జిల్లాల నుంచి గాని ఎవరైనా వస్తే వారి సమాచారాన్ని గ్రామ పోలీస్ అధికారులకు తెలపాలని సూచించారు. ప్రతిఒక్కరూ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించి వ్యాధి ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ‘గ్రీన్‌జోన్‌లో ఉన్నామని, మనకు ఏమీ కాదని, నిర్లక్ష్యం చేయకుండా అందరూ నిబంధనలు పాటించి, కరోనా నివారణకు కృషి చేయాలని సూచించారు.