- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
' మా బతుకులు రోడ్డుపాలు చేయొద్దు '

దిశ, ఘట్కేసర్ : రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ అనే విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఘట్కేసర్, నారపల్లిలోని డాక్యుమెంట్ రైటర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు మంగళవారం ఘట్కేసర్, నారపల్లిలో డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు మూసి వేసి బంద్ పాటించారు. ఘట్కేసర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ పద్ధతి వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఆన్లైన్లో పొరపాటులను సవరించుకొనే ఎడిట్ ఆప్షన్ కూడా లేదని తెలిపారు.
అంతే కాకుండా ఉద్యోగాలు దొరక్క స్వయం ఉపాధి కింద దస్తావేజు లేఖనం చేసుకుంటూ తమతో పాటు తమ కార్యాలయాల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి జీవనం సాగిస్తున్న వేల మంది డాక్యుమెంట్ రైటర్ల బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్లాట్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం కూడా తమ కార్యాలయాలు బంద్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు నరేశ్ గౌడ్, అబ్బసాని రాజేష్, బత్తుల శ్రీకాంత్ గౌడ్, సుధాకర్, లక్ష్మణ్ చారి, బీట్కూరి కృష్ణ కుమార్, గ్యార మహేష్, అనీల్, రాపోలు నరేశ్, యూనిస్, సునీల్, మహేష్ , శివరెడ్డి, శ్రవణ్, వేముల అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.