‘నా ముందున్న సవాల్ ఇదే’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-04-15 09:17:14.0  )
‘నా ముందున్న సవాల్ ఇదే’.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా నా తొలి ప్రయాణం మొదలైనప్పుడు హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నట్లు గుర్తుందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్(Hyderabad) అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా ఉందని తెలిపారు. వృద్ధిరేటులో ఆంధ్రప్రదేశ్ నేడు రెండో స్థానంలో ఉంచడం నా ముందు ఉన్న కొత్త సవాల్ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సవాల్‌ను అవకాశంగా భావిస్తున్నామని అన్నారు. మరింత కష్టపడి పని చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇవాళ(మంగళవారం) ఉదయం 11 గంటల నుంచి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ(AP Cabinet Meeting) జరుగుతున్న విషయం తెలిసిందే. రేపు(బుధవారం) సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రేపు రాత్రి ఢిల్లీ చేరుకోనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి విదేశీ పర్యటనకు చంద్రబాబు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed