- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆటో ఎక్స్‌పో-2022 ప్రదర్శనను వాయిదా వేసిన సియామ్!
దిశ, వెబ్‌డెస్క్: ఆసియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ ప్రదర్శనగా పేరున్న భారత ‘ఆటో ఎక్స్‌పో-ది మోటార్ షో’ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టు దేశీయ తయారీదారుల సంఘం సియామ్ వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి పరిస్థితులు, మూడో వేవ్ అంచనా కారణంగానే ఈ 2022, ఫిబ్రవరిలో జరగాల్సిన ప్రదర్శనను వాయిదా వేస్తున్నామని సియామ్ వివరించింది. ఈ ప్రదర్శన నిర్వహించడం వల్ల భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, దానివల్ల కరోనా నిబంధనలను అమలు చేయడం కష్టమవుతుందని సియామ్ తెలిపింది. రానున్న నెలల్లో కొవిడ్-19 వ్యాప్తి ఎలా ఉంటుందోననే ఆందోళనలున్నాయి. బిజినెస్-టూ-కస్టమర్ తరహాలో జరిగే ఈ ఆటో ఎక్స్‌పో కరోనా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. అందుకే ఈ ప్రదర్శనను వాయిదా వేయాలని నిర్ణయించామని, తర్వాత ఎప్పుడు నిర్వహించనున్నది ఈ ఏడాది చివర్లో ప్రకటించనున్నట్టు సియామ్ వెల్లడించింది. కాగా, గతేడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో కార్యక్రమానికి 6 లక్షల మంది పాల్గొన్నారు.