షారుఖ్ మొదటి రోజే లేట్ : బాలీవుడ్ హీరో

by Jakkula Samataha |
షారుఖ్ మొదటి రోజే లేట్ : బాలీవుడ్ హీరో
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, బ్యూటిఫుల్ దీపికా పదుకొనే జంటగా నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాకు పదమూడేళ్లు. ఫరా ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారానే దీపిక బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. శ్రేయాస్ తల్పాడే షారుఖ్ ఫ్రెండ్‌గా కనిపించారు. దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా రిలీజై పదమూడేళ్లయిన సందర్భంగా.. ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ షేర్ చేశాడు శ్రేయాస్.

షూటింగ్ మొదటి రోజునే షారుఖ్ లేట్‌గా వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తొమ్మిది గంటలకు షూటింగ్ అని చెప్పడంతో.. తను ఉ.7:30 గం.లకే వచ్చి విగ్, మేకప్‌తో సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. అందరూ చెప్పిన టైమ్‌కు రెడీ అయిపోయారని, కానీ షారుఖ్ మాత్రం పది గంటలకు లేట్‌గా వచ్చారని చెప్పాడు. దీంతో డైరెక్టర్ ఫరా ఖాన్ అందరినీ వెయిట్ చేయించారని షారుఖ్‌ను మందలించారని తెలిపాడు. ఆ తర్వాత షారుఖ్ తన మేకప్ రూమ్‌కు వచ్చి సారీ చెప్పారన్న శ్రేయాస్.. ‘రేపటి నుంచి మీరందరూ కూడా పది గంటలకే రండి’ అని నవ్వేశాడని తెలిపాడు. దీంతో తర్వాతి రోజు నుంచి ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్ స్పాట్‌కు చేరుకుని రెడీ అయ్యేవాళ్లమని.. పది గంటలకు షూటింగ్ స్టార్ట్ అయ్యేదని తెలిపాడు.

Advertisement

Next Story