- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రద్ధ దీపావళి ఇలా…
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఒకరైన ‘సాహో’ భామ శ్రద్ధా కపూర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. జంతువుల సంరక్షణ కార్యక్రమాలతోపాటు ప్రకృతిని పరిరక్షించేందుకు చేపట్టే ప్రోగ్రామ్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ ఉంటుంది. దీపావళి దగ్గర పడుతుండటంతో ఈ సారి పండుగను మరింత ప్రత్యేకతగా మారుస్తూ.. ఇలా కూడా జరుపుకోవచ్చంటూ అభిమానులకు సూచిస్తుంది. ది బాడీ షాప్ ఇండియా ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఫర్ చేంజ్ సంస్థ భాగస్వామ్యంతో ‘నారి’ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. మనకు కనిపించని కరోనా వారియర్స్ అయిన మహిళా పారిశుధ్య కార్మికులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. కేవలం రూ. 20 డొనేట్ చేయడం ద్వారా వారికి హెల్ప్ చేయొచ్చని తెలిపింది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా వారికి, వారి కుటుంబాలకు పీపీఈ కిట్స్, రోజూ భోజనం, పోషకాహార మందులు, జాబ్ ట్రైనింగ్ ఇస్తున్నామని వివరించింది శ్రద్ధ. నా వంతు సహాయం చేశానని..మీరూ నాతో కలిసి రావాలని అభిమానులను కోరింది. మన వీధులను పరిశుభ్రంగా ఉంచేవారికి ఈ దీపావళిని ‘ప్రత్యేకమైన దీపావళి’గా మార్చాలని కోరింది.