- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పు చేసిన భర్త.. చెల్లించకపోయేసరికి భార్యను అలా చేసి..
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అప్పు చేసినవారు అప్పు చెల్లించకపోతే అప్పు ఇచ్చిన వారు ఏం చేస్తారు. ఇంట్లో ఉన్న వస్తువులను, వాహనాలను తీసుకెళ్తారు. ఇంకా కొంచెం కర్కశంగా ప్రవర్తించేవాళ్లయితే ఇంటి ముందు గొడవపడి వారి పరువు తీస్తారు. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం అంతకంటే దారుణానికి పాల్పడ్డాడు. అప్పు తిరిగి చెల్లించకపోయిన వ్యక్తి భార్య ఫోటోను, ఫోన్ నెంబర్ ను అశ్లీల వెబ్ సైట్ లో పెట్టి రాక్షసానందం పొందాడు. ఈ దారుణ ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే.. కరీంనగర్ లోని ఓ వ్యక్తి , తనకు తెలిసిన మరో వ్యక్తి వద్ద దగ్గర రూ. 70 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లిస్తానని మూడు నెలలు గడువు తీసుకున్నాడు. కానీ, అనుకున్న సమయానికి డబ్బు అందకపోయేసరికి అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి చాలా సార్లు డబ్బులు కోసం అతడిని అడిగాడు. ఈరోజు ఇస్తా.. రేపు ఇస్తా అంటూ అతని చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. ఇక అతని మాటలతో విసిగిపోయిన అప్పిచ్చిన వ్యక్తి అతనిపై కక్ష పెంచుకున్నాడు.
తన దగ్గర డబ్బు తీసుకుని అప్పు చెల్లించని వ్యక్తి భార్య ఫోటోను సంపాదించి.. సదరు ఫోటోను అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశాడు.అంతేకాకుండా ఆ ఫోటో కింద ఆమె ఫోన్ నెంబర్ ని యాడ్ చేశాడు. దీంతో ఆమె ఫోన్ కి రోజూ చాలామంది ఫోన్ చేసి విసిగించండం మొదలుపెట్టారు. ఇక తనకు ఫోన్ కాల్స్ చేసి కొందరు అసభ్యంగా మాట్లాడి ఇబ్బంది పెట్టడంతో ఆ గృహిణి విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు అప్పిచ్చిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్దారించుకొని అతడిని అరెస్ట్ చేశారు.