పార్టీ పెట్టకముందే వైఎస్ షర్మిలకు భారీ షాక్

by Shyam |   ( Updated:2021-06-14 22:58:25.0  )
పార్టీ పెట్టకముందే వైఎస్ షర్మిలకు భారీ షాక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిలకు భారీ షాక్ తగిలింది. ఆమె పార్టీ పేరు ప్రకటించక ముందే అడ్ హక్ కమిటీలకు రాజీనామాలు ప్రారంభమయ్యాయి. నిజమైన వైఎస్ఆర్ అభిమానులకు షర్మిల పార్టీలో గుర్తింపు లభించడం లేదనే ఈ రాజీనామాలు చేస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. మంగళవారం దేవరకద్ర కేటీ నరసింహారెడ్డి సన్నాహక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. కాపేట్లో ఆయన లోటస్ పాండ్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన రాజీనామాను ప్రకటించనున్నారు. ఇదే దారిలో మరి కొంత మంది అడ్ హక్ కమిటీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కాగా, షర్మిల వెంట ఉన్న సతీష్ బీజేపీకి, ఇందిరా శోభన్ కాంగ్రెస్ పార్టీకి కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అసలైన వైఎస్ఆర్ అభిమానులకు పార్టీలో గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story