శోభిత అబద్ధం చెప్పింది ….?

by Shyam |   ( Updated:2020-04-25 05:31:51.0  )
శోభిత అబద్ధం చెప్పింది ….?
X

శోభిత ధూళిపాళ్ల…. అడవి శేషు హీరోగా వచ్చిన “గూఢ చారి” సినిమాతో తెలుగులో గుర్తింపు పొందింది. “మేజర్” సినిమాలోనూ కీలక పాత్ర చేయబోతున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉన్న భామ.. ఓ మాగజైన్ కోసం ఇంట్లోనే తనకు తానుగా ఫోటో షూట్ చేసుకున్నట్లు చెప్పింది. ఈ మధ్యే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపింది భామ. కానీ తీరా ఫోటోలు అప్ లోడ్ చేశాక… అందులో ఒక వ్యక్తి తనను ఫోటో తీస్తున్నట్లు ఉంది. దీంతో నెటిజన్లు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. తను అబద్ధం చెప్పిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలో ఇంత కూడా బాధ్యత లేకుండా వ్యవహరించింది అని మండిపడ్డారు.

దీంతో ఈ విషయం పై క్లారిటీ ఇచ్చింది శోభిత. నిజానికి ఈ ఫోటో షూట్ సెల్ఫ్ గానే చేసుకున్నాను అని చెప్పింది. అయితే ఈ క్రమంలో టెర్రస్ పైకి వెళ్ళినప్పుడు… అక్కడ ఉన్న వారిలో ఒకరు నాకు హెల్ప్ చేశారని చెప్పింది. కానీ ఆ ఫోటోలు ఏవి కూడా మాగజైన్ కోసం పంపలేదని చెప్పింది. సెల్ఫ్ గా తీసుకున్న ఫోటోలే మాగజైన్ కు వినియోగించానని తెలిపింది. దయచేసి నిజానిజాలు తెలియకుండా ఇలా విమర్శలు చేయడం పద్ధతి కాదని చెప్పింది శోభిత.


Tags: Shobhitha dhulipala, Gudha chari, Major, Adavi Seshu, Photo Shoot

Advertisement

Next Story