షెడ్డు కూలి గొర్రెలు మృతి

by Shyam |
షెడ్డు కూలి గొర్రెలు మృతి
X

దిశ, తుంగతుర్తి: గతవారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు షెడ్డు కూలి మూడు గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుంటపెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తికి సంబంధించిన షెడ్డు వర్షాలకు అకస్మాతుగా కూలడంతో మూడు గొర్రెలు చనిపోయాయి. దీంతో బాధితుడు సోమయ్య కన్నీటి పర్యంతం అయ్యాడు.

Advertisement

Next Story