వైద్యానికి స్పందిస్తున్న శశికళ

by Shamantha N |
వైద్యానికి స్పందిస్తున్న శశికళ
X

బెంగళూరు: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత శశికళ స్పృహలోనే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చికిత్సకు స్పందిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరు మెడికల్ కాలేజీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ, ఆమె ఆరోగ్యపరిస్థితి మాత్రం క్లిష్టంగానే ఉన్నదని సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె ఈ నెల 27న విడుదల కానున్నారు.

కానీ, ఇంతలో అనారోగ్యానికి గురికావడంతో బుధవారం తొలుత బౌరింగ్ హాస్పిటల్‌కు చేర్చారు. శ్వాసతీసుకోవడంలో సమస్య తలెత్తడంతో కరోనా టెస్టులు చేశారు. ముందు నెగెటివ్ వచ్చినప్పటికీ చివరికి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. అనంతరం ఆమెను బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు చెందిన కొవిడ్ సెంటర్‌కు తరలించారు. శశికళ మధుమేహం, తీవ్రమైన థైరాయిడ్, మూత్రపిండాల్లో సమస్యలతోనూ బాధపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed