నవంబర్‌లో షారుఖ్ ‘పఠాన్’ ఫిల్మింగ్..

by Jakkula Samataha |
నవంబర్‌లో షారుఖ్ ‘పఠాన్’ ఫిల్మింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ రొమాంటిక్ కింగ్ షారుఖ్ ఖాన్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. 2018లో విడుదలైన ‘జీరో’ సినిమాలో చివరగా కనిపించిన షారుఖ్.. ఇప్పుడు మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ‘పఠాన్’ సినిమా ద్వారా అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతుండగా.. ‘ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాల్లో కో స్టార్‌గా నటించిన దీపికా పదుకొనే ఈ సినిమాలో మరోసారి షారుఖ్‌తో ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్ చేయనుంది. స్టైలిష్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విలన్‌ పాత్రకు ఓకే చెప్పిన జాన్ అబ్రహం.. ఫస్ట్ టైమ్ షారుఖ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.

నవంబర్ నుంచి పఠాన్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ముంబైలోని యశ్ రాజ్ స్టూడియోస్‌లో షారుఖ్‌పై చిత్రీకరణ జరగనుంది. రెండు నెలల షూటింగ్ తర్వాత గ్యాప్ తీసుకొని.. మళ్లీ జనవరిలో షూటింగ్ షురూ చేయనున్నారు. అదే షెడ్యూల్‌లో దీపిక, జాన్ అబ్రహం షారుఖ్‌తో పాటు జాయిన్ అవనున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోంది. మొత్తానికి షారుఖ్ మళ్లీ సెట్స్ మీదకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Advertisement

Next Story