- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కోవిడ్ రూల్స్ బ్రేక్.. మాస్కు లేకుండా షర్మిల దీక్ష
దిశ, ముషీరాబాద్: తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఇందిరాపార్క్ వద్ద వైఎస్ షర్మిల దీక్ష చేపట్టారు. అయితే.. దీక్షలో ఆమె కోవిడ్ నిబంధనలను తుంగలో తొక్కారు. ప్రారంభం నుంచి మాస్క్ ధరించకుండా వేదికపై కూర్చున్న షర్మిల సాయంత్రం వరకు అలాగే దీక్షను కొనసాగించారు. షర్మిల దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన వైఎస్ విజయమ్మ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్యలు సైతం మాస్కులు ధరించకుండానే వేదికపై కూర్చోవడం గమనార్హం. తాను చేపట్టిన దీక్షకు మద్దతు పలికేందుకు వచ్చిన ప్రజల సైతం మాస్కు లేకుండానే ఫోన్లు తీసుకొని షర్మిల సెల్ఫీలు దిగారు. ఇదిలా ఉంటే పరిమిత సంఖ్యలోనే దీక్షకు ప్రజలు హాజరు కావాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో దీక్షలో పాల్గొన్నారు. చాలా మంది మస్కులు ధరించకుండానే దీక్షలో పాల్గొన్నారు. భౌతిక దూరం పాఠించిన ధాఖలాలు ఎక్కడా కనిపించలేదు. దీంతో పలువురు దీనిపై విమర్శలు చేస్తున్నారు.