Cars Discounts: కారు కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్..ఈ మోడల్స్ పై ఏకంగా రూ.85,000 డిస్కౌంట్​!

by Bhoopathi Nagaiah |
Cars Discounts: కారు కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్..ఈ మోడల్స్ పై ఏకంగా రూ.85,000 డిస్కౌంట్​!
X

దిశ, వెబ్‌డెస్క్ : పండగలకు చాలా మంది కొత్త వాహనాలు కొనాలని ప్లాన్ చేస్తుంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని పలు కంపెనీలు భారీ డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. జనవరిలో టాటా(Tata), మారుతీ(Maruti), హోండా(Honda) సంస్థ ఇచ్చే డిస్కౌంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ కారు తయారీదారు సంస్థ అయిన మారుతీ సుజుకి(Maruti Suzuki) తమ ఉత్పత్తులపై ఈ పండుగ సీజన్లో పలు ఆఫర్లను ప్రకటించింది. ఎర్టిగా కొత్త జనరేషన్ డిజైనర్ కార్లు మినహా మిగతా వాటి అన్నింటిపై ఈ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్సైజ్ బోనస్, స్క్రాప్ ఈజ్ బెనిఫిట్స్, స్పెషల్ ఎడిషన్ కిట్స్ కూడా ఉన్నాయి. ఈ ఏడాది విడుదలైన మోడల్స్ పై ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. 2024లో రిలీజ్ అయిన కార్లకు కూడా మంచి క్యాష్ డిస్కౌంట్లు(Cash discounts) లభిస్తున్నాయి.

ఆల్టో కే10పై(Alto K10)

మారుతి ఈసారి మారుతి ఆల్టూ కే10పై భారీ ఆఫర్ అందిస్తోంది. మీరు మాన్యువల్ లేదా సీఎన్జీ వేరియంట్స్ కొనాలనుకుంటే రూ. 5వేల క్యాష్ డిస్కౌంట్ తోపాటు మొత్తం రూ. 62,000 బెనిఫిట్స్ కూడా పొదవచ్చు. ఇక ఎంవై25పై రూ. 47,100 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఆల్టూ కే 10 ధర రూ. 3.99 లక్షల నుంచి 5.96లక్షల వరకు ఉంటుంది.

వ్యాగన్ ఆర్ (Wagon R)

వ్యాగన్ ఆర్ సీఎన్జీ, మాన్యువల్ పై రూ. 30, 000 క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఎంవై 24 యూనిట్స్ పై మొత్తం రూ. 57,100 బెనిఫిట్స్ లభిస్తోంది. ఇక ఎంవై 25 యూనిట్స్ పై రూ. 15,000 క్యాష్ బెనిఫిట్స్ మొత్తం రూ. 57, 100 డిస్కౌంట్స్ అందిస్తున్నారు. అయితే అన్ని వేరియంట్స్ పై స్క్రాపేజ్, కార్పొరేట్ బోనస్ పై ఒకే విధంగా ఉంటాయి. ఈ కారు ధర రూ. 5.54 లక్షల నుంచి రూ. 7.20 లక్షల వరకు ఉంటుంది.

స్విప్ట్​( Swift)

ఓల్డ్ జనరేషన్ స్విఫ్ట్ ఆటోమేటిక్ మాన్యువల్ వేరియంట్లకు ఒకే రకమైన ప్రయోజనాలు లభిస్తాయి. అయితే సిఎన్జి వేరియెంట్ కార్లకు క్యాష్ డిస్కౌంట్ ఉండదు. కానీ ఎక్సేంజ్ లేదా స్క్రాబేజ్ బోనస్ లో ఉంటాయి. ఈ కారు ధర రూ.6 24 లక్షల నుంచి 9.14 లక్షల వరకు ఉంటుంది. ఈ కొత్త జనరేషన్ స్విఫ్ట్ కూడా ఆటోమేటిక్ మాన్యువల్ వేరియంట్లకు ఒకే రకమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో సిఎన్జి వేరియంట్ పై ఎంవై 24 యూనిట్స్ కి రూ.35,000 ఎంవై 25 యూనిట్స్ కి రూ.15,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర 6.49 లక్షల నుంచి 9.59లక్షల వరకు ఉంటుంది.

టాటా కార్లపై డిస్కౌంట్(Discounts on Tata cars)

జనవరిలో టాటా కంపెనీ కూడా తన కార్ల శ్రేణిలోని రెండు పాపులర్ కార్లపై డిస్కౌంట్ ని ప్రకటించింది. పంచ్ ఈవీ, టియాగో ఈవీపై ఆఫర్స్అందిస్తోంది. ఈ రెండు కార్లకు జనవరిలో రూ.85వేల వరకు డిస్కౌంట్లు అందిస్తుంది.

హోండా ఆఫర్(Honda offer)

ఈ పండగకు హోండా కూడా తమ కార్లపై డిస్కౌంట్ ప్రకటించింది. హోండా ఎలివేట్ ఫిఫ్త్ జనరేషన్ హోండా సిటీ, సిటీ హైబ్రిడ్ కార్ల పై ఈ ఆఫర్ పొందవచ్చు. ఎస్ యు వి పై రూ.45 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కారు ధర రూ.11.69 లక్షల నుంచి ఒకటి రూ. 16.71వరకు ఉంటుంది

Next Story