- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షేర్‌చాట్ నుంచి టిక్‌టాక్ ఆల్టర్నేటివ్ యాప్
దిశ, వెబ్‌డెస్క్ : చైనాకు చెందిన పాపులర్ యాప్స్.. టిక్‌టాక్, షేర్ చాట్, యూసీ బ్రౌజర్, వి చాట్‌లతో పాటు మొత్తంగా 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. మిగతా యాప్స్ గురించి పక్కనపెడితే.. ఇండియాలో 119 మిలియన్ల యాక్టివ్ యూజర్లను కలిగిఉన్న టిక్‌టాక్‌కు ఫుల్ క్రేజ్ ఉన్న మాట వాస్తవం. అయితే ప్రస్తుతానికి టిక్‌టాక్ లేకపోవడంతో.. చింగారీ, మిత్రోన్, రోపోసో యాప్‌లు ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. తెలంగాణ నుంచి కూడా టిక్‌టాక్ ఆల్టర్నేట్‌గా ‘చట్‌పట్’ యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ షేర్‌చాట్ కూడా తాజాగా ‘మోజ్’ పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. ఈ యాప్‌లోనూ టిక్‌టాక్‌లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉండటం గమనార్హం.
లోకల్ లాంగ్వేజ్‌లో పాపులర్ అయిన యాప్స్‌లో ‘షేర్ చాట్’ కూడా ఒకటి. ఇంజనీరింగ్ చదివిన ముగ్గురు ఫ్రెండ్స్ ‘బెంగళూరు’ కేంద్రంగా షేర్‌చాట్‌ను ప్రారంభించారు. ఇది మొట్టమొదటి భారతీయ సోషల్ మీడియా నెట్‌వర్క్. 15 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్న షేర్ చాట్.. చాలా విషయాల్లో భారతీయుల ‘హృదయాన్ని’ ప్రతిబింబిస్తోంది. లోకల్ లాంగ్వేజెస్‌తో పాటు యాసలలోనే వీడియోలు, కోట్స్, ఫొటోలు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు ఈ యాప్ నిర్వాహకులు మరో ప్రయత్నం చేస్తున్నారు. అదే ‘మోజ్’ యాప్. ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను 4 గంటల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్ చేసుకోవడం విశేషం.
మోజ్ యాప్‌లో 15 భారతీయ భాషలు ఉపయోగించుకోవచ్చు. టిక్‌టాక్‌లో ఉన్నటువంటి.. షార్ట్ వీడియోలు, స్పెషల్ ఎఫెక్ట్స్, స్టిక్కర్స్, ఎమోటికన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. 15 సెకన్ల డ్యూరేషన్ ఉన్న వీడియోలను ఫిల్టర్లు, ఎమోట్స్‌తో బ్యూటిఫై చేసుకుని అప్‌లోడ్ చేసే అవకాశం ఇందులో ఉంది. లిప్ సింకింగ్ ఫంక్షనాలిటీ కూడా ఉన్న ఈ యాప్‌లో ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. కాకపోతే షేర్ చాట్‌లానే ఇందులోనూ ఇంగ్లిష్ లాంగ్వేజ్ సపోర్ట్ చేయదు.
టిక్‌టాక్ ఆల్టర్నేట్ యాప్స్
చింగారి – 50 లక్షల డౌన్‌లోడ్స్
రోపోసో – 5 కోట్ల డౌన్‌లోడ్స్
మిత్రోన్ – కోటి ప్లస్ డౌన్‌లోడ్స్
జీ5 కూడా టిక్‌టాక్‌ను పోలీన యాప్‌ను ‘హైపై’(hipi) పేరుతో జులై 15న లాంచ్ చేయనుంది.