భారీ నష్టాల్లో మార్కెట్లు!

by Harish |
భారీ నష్టాల్లో మార్కెట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: అంతర్జాతీయంగా రెండో దశ కొవిడ్-19 భయాల మధ్య ఇన్వెస్టర్ల ఆందోళనతో యూరోపియన్ మార్కెట్లలో అమ్మకాలు పెరిగాయి. దీంతో జర్మనీ, ఫ్రాన్స్, యూకె మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. ఇక దేశీయంగా ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో ఈక్విటీ మార్కెట్లు ఆరంభ లాభాల నుంచి నష్టాల్లోకి చేరాయి. ఆసియా మార్కెట్లలో బలహీనతల కారణంగా దేశీయ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. పైగా, గురువారంతో జూన్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండం వల్ల ట్రేడర్లు లాభాల స్వీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా మార్కెట్ల నష్టాలకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా బ్యాంకింగ్, ఫార్మా, ఫైనాన్షియల్ రంగాల్లో నష్టాలు నమోదు కావడంతో నిఫ్టీ బ్యాంకు భారీగా పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత అనుకోకుండా అమ్మకాలు పెరగడంతో మార్కెట్లు లాభాల నుంచి కుదేలయ్యాయి. దీంతో, మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 561.45 పాయింట్లను కోల్పోయి 34,868 వద్ద ముగియగా, నిఫ్టీ 165.70 పాయింట్లను నష్టపోయి 10,305 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, ఐటీసీ, నెస్లె ఇండియా, టెక్ మహీంద్రా, రిలయన్స్ టీసీఎస్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాలను నమోదు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed