- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శరద్ పవార్ కాన్వాయ్ వాహనం బోల్తా
ముంబయి: ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ కాన్వాయ్‌లోని వాహనం బోల్తాపడింది. పవార్ ప్రయాణిస్తున్న వాహనం మాత్రం సేఫ్‌గా బయటపడింది. ఈ ఘటన మహారాష్ట్ర పూణె జిల్లాలోని ఖండాల సమీపంలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. శరద్ పవార్ పూణె నుంచి ముంబయికి వస్తున్నారు. రాష్ట్ర హైవే పోలీసు విభాగానికి చెందిన డ్రైవర్ నడుపుతున్న వాహనం పవార్ కాన్వాయ్ భాగంగా ప్రయాణిస్తున్నది. లోనావాలాకు దగ్గరలోని ఓ పాత బ్రిడ్జీ వద్దకు రాగానే ఉన్నట్టుండి ఆ జీపు స్కిడ్ అయి బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొట్టింది. వెనుకే వస్తు్న్న పవార్ కారు సురక్షితంగా బయటపడింది. ఈ ఘటనలో ఆ వాహనం నడుపుతున్న పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం, శరద్ పవార్ కారు నుంచి దిగి గాయపడ్డ పోలీసుకు వైద్య పరీక్షలను పర్యవేక్షించినట్టు పార్టీ కార్యకర్తలు చెప్పారు. వెంటనే ఆ వాహనాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్ సుగమమయ్యేలా చర్యలు తీసుకున్నట్టు హైవే పోలీసు తెలిపారు.