- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మానవత్వమే నిజమైన బాధ్యత : షారుక్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ .. మరోసారి కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుండగా అండగా నిలిచేందుకు నేనున్నానని ముందుకొచ్చారు. మానవజాతి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో మన నిజమై బాధ్యత … మానవత్వాన్ని చాటుకోవడం అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోవిడ్ 19పై అవగాహన కల్పించడంతో పాటు పేదల కనీస అవసరాలు తీర్చాల్సి ఉందన్నారు.
Parted by distance, we come together to fight off COVID-19 and make India safer & healthier! @iamsrk @KKRiders @MeerFoundation @vfx_redchillies @rotibankfdn @IndiaWpc @ek7foundation @pragyakapoor_ pic.twitter.com/kl2chmQ8pm
— Red Chillies Entertainment (@RedChilliesEnt) April 3, 2020
అందుకే తన టీం రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్, మీర్ ఫౌండేషన్, రెడ్ చిల్లీస్ వీఎఫ్ఎక్స్‌తో కలిసి పలు సహాయక కార్యక్రమాలు చేపడ్తున్నట్లు ప్రకటించారు. పీఎం కేర్స్ ఫండ్, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలతో కలిసి హెల్త్ కేర్ వర్కర్స్‌కు 50 వేల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్లను అందిస్తామని వెల్లడించారు. ఏక్ సాత్ ఫౌండేషన్‌తో కలిసి సంయుక్తంగా 5500 కుటుంబాలకు నెల రోజుల పాటు భోజనానికి కావాల్సిన సరుకులను అందిస్తామని తెలిపారు. రోటీ బ్యాంక్ ఫౌండేషన్ సహకారంతో 10 వేల మందికి మూడు లక్షల భోజనం కిట్లను అందిస్తామన్నారు. వర్కింగ్ పీపుల్స్ చార్టర్‌తో కలిసి 2500 మంది కూలీలకు నెల రోజుల పాటు కనీస అవసరాలు తీర్చే బాధ్యత తీసుకున్నారు షారుక్. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ ప్రాంతాలకు చెందిన 100 మంది యాసిడ్ అటాక్ బాధితులకు నెలవారి ఖర్చులకు డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
Tags: Shahrukh Khan, Bollywood, CoronaVirus, Covid 19