- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాధవన్‌ను ప్రశ్నించనున్న షారుఖ్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్.. 2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. అయితే షారుఖ్ రాబోయే రెండు సినిమాల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అందులో ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే చిత్రం ఒకటి కాగా.. పద్మభూషణ్ అవార్డు గ్రహీత , ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో నంబి నారాయణన్ పాత్రలో మాధవన్ నటించారు. అంతేకాదు ఈ చిత్రానికి మాధవనే స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నారు. ఈ సినిమాలో సైంటిస్ట్ నంబి నారాయణ్‌ను ఇంటర్య్వూ చేసే జర్నలిస్ట్‌గా షారుఖ్ కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో సిమ్రన్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. కాగా షారుఖ్ ‘జీరో’లో మాధవన్ సైంటిస్ట్‌గా గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.
రణ్‌బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్, మౌని రాయ్‌లు నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోనూ షారుఖ్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుఖ్ ఓపెనింగ్ సీన్‌లో ‘సైంటిస్ట్’గా కనిపించి, ఫాంటసీ వరల్డ్‌లోకి ప్రేక్షకులను తీసుకెళ్తారని సమాచారం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే షారుఖ్ ‘జీరో’ తర్వాత చేసే ప్రాజెక్టేది ఇంకా ఖరారు కాలేదు. రాకేష్ శర్మ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వార్తలొచ్చినా.. తాను అందులో నటించడం లేదని షారుఖ్ తేల్చేశారు.