- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ సెంచరీ కొట్టిన తొలి ఆఫ్ఘన్ క్రికెటర్
దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో హష్మతుల్లా షాహీదీ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘాన్ క్రికెటర్‌గా రికార్డులకు ఎక్కాడు. జింబాబ్వేతో అబుదాబీలో జరుగుతున్న రెండో టెస్టులో హష్మతుల్లా షాహీదీ డబుల్ సెంచరీ సాధించడంతో ఆఫ్ఘాన్ జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 545 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ జట్టుకు ఇది టెస్టుల్లో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. ఆప్ఘనిస్తాన్ అంతకు ముందు బంగ్లాదేశ్‌పై 2019లో 342 పరుగులు చేసింది. అదే అత్యధిక స్కోరు. ఆ మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్ టెస్టుల్లో తమ తొలి విజయాన్ని సాధించింది. తాజాగా షాహీదీ విజృంభించడంతో ఆఫ్ఘానిస్తాన్ తమ టెస్టు కెరీర్‌లో అత్యధిక పరుగులను చేసింది. 443 బంతుల్లో షాహీదీ 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టును జింబాబ్వే గెలుచుకున్నది.