షాహిద్ అఫ్రిది కూతురితో షాహిన్ అఫ్రిది పెళ్లి?

by Shiva |   ( Updated:2021-03-08 02:17:09.0  )
షాహిద్ అఫ్రిది కూతురితో షాహిన్ అఫ్రిది పెళ్లి?
X

దిశ వెబ్‌డెస్క్: పాకిస్తాన్ యువ పేసర్ షాహిన్ అఫ్రిది త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడట. ఇంతకు అతడు పెళ్లి చేసుకోబోయే యువతి ఎవరో కాదు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫిది కూతురు అక్సా అఫ్రిది. ప్రస్తుతం ఈ వార్త పాకిస్తాన్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. షాహిన్ అఫ్రిది, షాహిద్ అఫ్రిది మాత్రం ఇప్పటివరకు ఈ వార్తలపై ఇంకా స్పందించలేదు. అయితే షాహిద్ అఫ్రిది తండ్రి అయాజ్ ఖాన్ మాత్రం వారిద్దరి పెళ్లిపై షాహిన్ కుటుంబంతో చర్చించాడని, వారు కూడా ఒప్పుకున్నారని వార్తలొస్తున్నాయి.

కానీ ఇప్పట్లో ఇప్పుడు వారిద్దరి పెళ్లి ఉండదని, రెండు సంవత్సరాల తర్వాత వీరి పెళ్లి ఉంటుందనే వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై స్పందించిన పాకిస్తాన్ జర్నలిస్ట్ ఇతిషామ్ ఉల్ హక్క్.. షాహిన్ అఫ్రిది పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనన్నారు. త్వరలోనే వీరి నిశ్చితార్ధం జరుగుతుందని, పెళ్లి మాత్రం అక్సా చదువు పూర్తయిన తర్వాత జరుగుతుందన్నారు.

కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో షాహిన్ అఫ్రిది, షాహిద్ అఫ్రిది ఇద్దరు ఆడుతున్నారు. షాహిన్ అఫ్రిది లాహోర్ క్యూలాండర్స్‌కు ఆడుతుండగా.. ముల్తాన్ సుల్తాన్ తరపున షాహిద్ అఫ్రిది ఆడుతున్నారు. కానీ ఆటగాళ్లలో కొంతమందికి కరోనా సోకడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను ఇటీవల వాయిదా వేశారు.

Advertisement

Next Story