- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మంత్రులు భయపడుతున్నారు.. ప్రతిపక్షాలంటే భయమెందుకు..?
దిశ,షాద్ నగర్: రాష్ట్రంలో ప్రభుత్వ దమనకాండ నడుస్తోందని, ప్రభుత్వం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి భయపడి పోలీసులను పెట్టి నాయకుల ఇళ్ల వద్ద పహారా కాస్తున్నారని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో బుధవారం వీర్లపల్లిశంకర్ స్వగృహంలో పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చితే ప్రతిపక్షం ఎందుకు వెంటాడుతుందని ప్రశ్నించారు. నేడు ప్రభుత్వం హామీలను విస్మరించి చేయాల్సిన పనులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రతిపక్షాలు వెంటాడుతున్నాయని అన్నారు. మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటించాలంటేనే భయపడుతున్నారని, పోలీసుల ద్వారా పోరాటాలను అదుపు చేస్తుండటం ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనమని శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు పర్యటిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులను ముందుగా పోలీస్ స్టేషన్లలో పెడుతుండటం సమంజసం కాదని, పోలీసులతో ఉద్యమాలను అదుపు చేయలేరని సరైన సమయంలో సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందని అన్నారు.