ప్రభుత్వ భవనాలకు గులాబీ రంగులా..? ఇదెక్కడి అరాచకం : SFI

by Sridhar Babu |
ప్రభుత్వ భవనాలకు గులాబీ రంగులా..? ఇదెక్కడి అరాచకం : SFI
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పినపాక మండలంలోని ఎస్టీ బాలుర హాస్టల్‌కు టీఆర్ఎస్ జెండా కలర్ వేయడంపై ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి రామాటేంకి శ్రీను తీవ్రంగా ఖండించారు. శనివారం ఎస్టీ బాలుర హాస్టల్‌కు గులాబీ కలర్ వేయడాన్ని తప్పుబడుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన వక్తంచేశారు. దీనిపై స్పందించిన అధికారులు వెంటనే కాంట్రాక్టర్‌తో మాట్లాడి టీఆర్ఎస్ జెండా కలర్‌ను తొలగించారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి మాట్లాడుతూ.. అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయని, అడ్డు అడుపులేకుండా పోతున్నాయన్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు గులాబీ రంగు వేసి తమ వశం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ కలర్ వేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ పార్టీ అప్రతిష్టపాలు చేస్తుందని విమర్శించారు. విద్యార్థుల శ్రేయస్సు, వారి చదువుకోసం ఎస్ఎఫ్ఐ శక్తి వంచన లేకుండా పనిచేస్తుందని చెప్పారు. గులాబీ రంగు వేస్తూ ప్రభుత్వ భవనాలను టీఆర్ఎస్ కార్యాలయాలు చేస్తున్న కాంట్రాక్టర్ లైసెన్సు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలకు నాణ్యమైన కలర్స్, నాణ్యమైన వస్తువులు వాడాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed