- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కామ కోర్కెల ఎస్‌కే శర్మ.. ఏంది నాకీ ఖర్మ! ఉద్యోగినిపై లైంగిక వేధింపులు

దిశ, వెబ్‌డెస్క్: హోదా ఎంత పెద్దదైన తన వక్రబుద్ధిని చాటుకుంటున్నారు కొందరు అధికారులు. తోటి ఉద్యోగులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులే తన లేకి చేష్టలతో పరువు తీసుకుంటున్నారు. మహిళా ఉద్యోగుల పట్ల సిల్లీగా వ్యవహరిస్తూ.. చీప్ అవుతున్నారు. తాజాగా ఓ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ ఉన్నత ఉద్యోగిపై కేసు నమోదు అయింది.
హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన మహిళ (35) హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పనిచేస్తోంది.
ఆమెను గతకొద్ది రోజులుగా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో పని చేసే సీనియర్ అధికారి ఎస్‌కే శర్మ తన కోర్కెలు తీర్చాలని లైంగికంగా వేధిస్తున్నాడు. కొద్ది రోజులు మౌనంగా భరించిన ఉద్యోగిని.. అతడిని హెచ్చరించింది. అయినా సీనియర్ అధికారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గేటు ఎదుట ధర్నాకు దిగింది. అనంతరం తోటి ఉద్యోగుల సలహా మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.