దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు రద్దు

by Shyam |
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు రద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని రూట్లలో సరిపడా రైళ్లు నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే కొన్ని రూట్లలో అసలు ప్రయాణికులే లేకపోవడంతో రైళ్లను రద్దు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే మరో 23 రైళ్లను తాత్కాలికంగా, పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ ప్రకటనతో ఔరంగాబాద్–నాందెడ్ వెళ్లే రైలు ఈ నెల 10 నుంచి 31 వరకు, నాందెడ్– ఔరంగాబాద్ ట్రైన్‌ సేవలు ఈ నెల 7 నుంచి 28 వరకు నిలిచిపోనున్నాయి.

అలాగే, ఆదిలాబాద్– నాందెడ్, నాందెడ్–ఆదిలాబాద్, వికారాబాద్– గుంటూర్, గుంటూర్ – వికారాబాద్, సికింద్రాబాద్– యశ్వంత్ పూర్, తిరుపతి– మన్నర్‌‌గుడి, కాచిగూడ– రేపల్లె, గుంటూరు– కాచిగూడ, సికింద్రాబాద్– సాయినగర్ శిరిడి, తిరుపతి– చెన్నై సెంట్రల్, చెన్నై సెంట్రల్ – తిరుపతి రైళ్లు ఈనెల 2 నుంచి ఈ నెల 31 వరకు క్యాన్సిల్ చేశారు. వీటికి తోడు యశ్వంత్‌పూర్– సికింద్రాబాద్, మన్నర్‌‌గుడి– తిరుపతి, సికింద్రాబాద్– విశాఖపట్నం, సాయినగర్ శిరిడి– సికింద్రాబాద్ రైళ్లు ఈనెల 3 నుంచి 31 వరకు రద్దు కానున్నాయి.

అంతేకాకుండా.. రేపల్లె – కాచిగూడ, కాచిగూడ– గుంటూర్ రైళ్లు ఈ నెల 03 నుంచి జూన్ 1 వరకు, విశాఖపట్నం– సికింద్రాబాద్ రైలు మే 4 తేది నుంచి జూన్1 వరకు, పర్బని– నాందెడ్ ఇదే 4 నుంచి జూన్ 02 వరకు, ఔరంగాబాద్– రేణిగుంట రైలు ఈ నెల 07 నుంచి 28 వరకు, రేణిగుంట– ఔరంగాబాద్ రైలు 08 నుంచి 29 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరిగి ఉత్తర్వులిచ్చే వరకూ పైన తెలిపిన రైళ్లు తాత్కాలికంగా రద్దుచేస్తున్నట్లు తెలిపారు. ఆయా రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed