గ్రేటర్ ఎన్నిక‌ల్లో పార్టీల బాహా బాహి

by Shyam |
గ్రేటర్ ఎన్నిక‌ల్లో పార్టీల బాహా బాహి
X

దిశ ప్ర‌తినిధి , హైద‌రాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌గ‌రంలోని ప‌లు డివిజ‌న్ల‌లో టీఆర్ఎస్-బీజేపీ , టీఆర్ఎస్-ఎంఐఎం వ‌ర్గాలు బాహా బాహికి దిగాయి. డ‌బ్బులు , మ‌ద్యం పంపిణీ చేస్తూ ఓట‌ర్ల‌ను మ‌భ్య‌పెడుతూ అక్ర‌మంగా ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నార‌ని ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకున్నాయి. దీంతో పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఉద్రిక్త‌త నెల‌కొంది. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ఘర్షణలకు దిగిన వారిని అక్క‌డికి నుండి పంపించి వేసి పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు.

గచ్చిబౌలి డివిజన్‌లో టీఆర్ఎస్, బీజేపి వ‌ర్గాల బాహాబాహి..
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నగరంలో గ‌చ్చిబౌలి డివిజ‌న్‌లో టీఆర్ఎస్, బీజేపీ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది . డివిజన్ పరిధిలోని గోపన్ పల్లిలో రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలతో బీజేపీ నాయకులు , కార్యకర్తలు టీఆర్ఎస్ వర్గీయులను అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

ఆగాపురాలో టీఆర్ఎస్ వ‌ర్సెస్ ఎంఐఎం…
గోషామ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం జాంబాగ్ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ , ఎంఐఎం వ‌ర్గాల మ‌ద్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. ఎంఐఎం పార్టీకి చెందిన వారు రిగ్గింగ్ కు పాల్ప‌డుతున్నార‌ని స‌మాచారం అందుకున్న టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఎం ఆనంద్ కుమార్ గౌడ్ ఆగాపురాకు చేరుకోవ‌డంతో ఇరు వ‌ర్గాల మ‌ద్య మాట‌ల యుద్దం న‌డిచింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి వారిని అక్క‌డినుండి పంపించి వేశారు.

ఆర్‌కె పురంలో…
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని ఆర్.కె.పురం డివిజన్‌లో 42వ పోలింగ్ బూత్ వద్ద టీఆర్ఎస్ పార్టీకి చెందిన డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి డబ్బులు పంచుతున్నాని.. ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనే ఆరోప‌ణ‌ల‌తో బీజేపీ నాయకులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు.

గుడి మ‌ల్కాపూర్‌లో..
గుడిమల్కాపూర్‌లో ఓ ఇంట్లో టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచు తుండగా బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాల నాయకులు పరస్పరం దూషించుకున్నారు. ప‌రిస్థితి అదుపు త‌ప్పే విధంగా ఉండ‌డంతో పోలీసులు ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టి అక్క‌డి నుండి పంపించి వేశారు.

కార్వాన్ డివిజ‌న్ లో ..
కార్వాన్ డివిజ‌న్ ప‌రిధిలోని 51వ పోలింగ్ బూత్‌లో అక్ర‌మాలు చోటు చేసుకుంటున్నాయ‌నే ఆరోప‌ణ‌ల‌తో ఎంఐఎం ఎమ్మెల్యే కౌస‌ర్ మొయినొద్ధిన్ , బీజేపీ కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ అమ‌ర్ సింగ్‌లు ఘ‌ర్ష‌ణకు దిగారు. మాటా మాటా పెరిగి ఒక‌రినొక‌రు తోసుకున్నారు. గొడ‌వ తీవ్రంగా మా‌రుతుండ‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితిలో మార్పు లేక‌పోవ‌డంతో ఇరు పార్టీల‌కు చెందిన కార్య‌క‌ర్త‌ల‌ను చెద‌ర‌గొట్టారు.అనంత‌రం నాయ‌కులిద్ద‌రు అక్క‌డినుండి వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed