ఫుట్‌బాల్‌ లీగ్‌లోకి సెరెనా విలియమ్స్

by Shyam |
ఫుట్‌బాల్‌ లీగ్‌లోకి సెరెనా విలియమ్స్
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ త్వరలో ఫుట్‌బాల్ లీగ్‌లోకి అడుగు పెట్టనున్నారు. టెన్నిస్ క్రీడాకారిణికి ఫుట్‌బాల్‌లో ఏం చేస్తుందని కంగారుపడకండి. త్వరలో ఆమె లాస్‌ఏంజెలిస్ కేంద్రంగా మహిళల ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేయనుంది. 2022లో అమెరికా నేషనల్ ఉమెన్స్ సాకర్ లీగ్ ప్రారంభమయ్యే నాటికి క్లబ్ ఏర్పాటు పూర్తవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఈ సాకర్ క్లబ్‌‌ను టెన్నిస్ స్టార్ సెరెనా, హాలీవుడ్ నటి నతాలీ పోర్ట్‌మాన్ కలసి ఏర్పాటు చేయనున్నారు. అయితే, ఈ టీమ్ హోమ్ టౌన్ ఏమిటో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రస్తుతానికి ఏంజెలిస్ సిటీగా పేరు పెట్టినట్లు నిర్వాహకులు చెప్పారు. నేషనల్ ఉమెన్స్ సాకర్ లీగ్‌లో ఇప్పటివరకు కాలిఫోర్నియా కేంద్రంగా ఎలాంటి సాకర్ క్లబ్‌లు లేవు. చాలా మంది ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మహిళా సాకర్ క్లబ్‌ను ఏర్పాటు చేసేది మహిళా సెలెబ్రిటీలైతే ఆ క్లబ్‌కు మరింత ప్రచారం దక్కుతుందని అంటున్నారు. అందుకే సెరెనా, నతాలీలు క్లబ్ ఏర్పాటులో చురుకుగా ఉన్నట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story