రెండో రోజూ నష్టాలనే చవిచూసిన స్టాక్ మార్కెట్

by Harish |   ( Updated:2021-07-20 07:41:13.0  )
business news
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. సోమవారం నాటి ప్రతికూల ర్యాలీని కొనసాగించాయి. ఉదయం నుంచే నష్టాలను చూసిన మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల ఆందోళనతో అంతర్జాతీయ మార్కెట్లు దెబ్బతిన్నాయి. ఆర్థిక వృద్ధిపై మదుపర్లు ఆందోళనపడ్డారని విశ్లేషకులు తెలిపారు. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్లో మెటల్, టెలికాం, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో సూచీలు పతనమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 354.89 పాయింట్లు కోల్పోయి 52,198 వద్ద ముగియగా, నిఫ్టీ 120.30 పాయింట్లు నష్టపోయి 15,632 వద్ద ముగిసింది.

నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, రియల్టీ, బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఫైనాన్స్ రంగాలు పతనమయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్ అధిక లాభాలను దక్కించుకోగా, ఆల్ట్రా సిమెంట్, హిందూస్తాన్ యూనిలీవర్, నెస్లె ఇండియా సానుకూలంగా ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.63 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed