- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ నష్టాల్లోనే ఈక్విటీ మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్ల (Domestic equity markets)ను నష్టాల నీడ వెంటాడుతోంది. మంగళవారం నాటి స్వల్ప నష్టాలను సూచీలు బుధవారం కూడా కొనసాగించాయి. కరోనా వైరస్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని భావిస్తున్న ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగాలను ఆస్ట్రాజెనెకా తాత్కాలికంగా ఆపేసింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడి అంతర్జాతీయ మార్కెట్లు (International markets) నీరసించాయి.
దీనికితోడు దేశీయంగా భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్ల (domestic markets) కు నష్టాలు తప్పలేదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 171.43 పాయింట్ల నష్టంతో 38,193 వద్ద ముగియంగా, నిఫ్టీ (Nifty) 39.35 పాయింట్లు కోల్పోయి 11,278 వద్ద ముగిసింది. నిఫ్టీలో అధికంగా బ్యాంకింగ్ రంగం నీరసించగా, ఐటీ, రియల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు డీలాపడ్డాయి. ఫార్మా, మెటల్, మీడియా రంగాలు పుంజుకున్నాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, రిలయన్స్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, ఎస్‌బీఐ, బజాజ్ ఫిన్‌సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 73.53 వద్ద ఉంది.