- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్వల్ప నష్టాల్లో దేశీయ మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటంతో పాటు, మెటల్ (Metal), ఫార్మా(Pharma), ఎఫ్‌సీజీ (Fcg) రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు(Equity markets) స్వల్పంగా నష్టాలను నమోదు చేశాయి.
ఉదయం నుంచే ఇదే ధోరణిలో ప్రారంభమైన సూచీలు మిడ్ సెషన్ సమయంలో అత్యధిక నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, తర్వాతి పరిణామాల్లో కొంత కోలుకుని స్వల్పంగా నష్టపోయాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్(Sensex) 37.38 పాయింట్లను కోల్పోయి 38,369 వద్ద ముగియగా, నిఫ్టీ (Nifty) 14.10 పాయింట్ల నష్టంతో 11,308 వద్ద ముగిసింది.
జూన్ (June) నెలకు సంబంధించిన్ పారిశ్రామికోత్పత్తి పాతాళానికి పడిపోవడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లు (International markets) బలహీనత కారణంగానే దేశీయ మార్కెట్లు నీరసించాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. నిఫ్టీలో ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులు (Govt sectors), మీడియా (Media), ఆటో రంగాలు (Auto sectors) 2 శాతానికిపైగా ర్యాలీ చేయగా, రియల్టీ, మెటల్, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ రంగాలు కొంత తగ్గాయి.
సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ (Hcl), ఎస్‌బీఐ(Sbi), టెక్ మహీంద్రా(Tech mahindra), మారుతీ సుజుకి (Maruthi suzuki), ఎంఅండ్ఎం, ఆల్ట్రాటెక్, ఎన్‌టీపీసీ(Ntpc), ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవ్వగా, కోటక్ బ్యాంక్ (Kotak bank), సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్(Tcl), టైటాన్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ(Hdfc)షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.83 వద్ద ఉంది.