- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ నష్టాలు నమోదు చేసిన మార్కెట్లు!
దిశ, వెబ్‌డెస్క్: ఫెడరల్ రిజర్వ్ అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆసియాలోని మార్కెట్లలో ఆందోళనలు పెరిగాయి. కొవిడ్-19 వల్ల ఆర్థిక రికవరీ అనిశ్చితిలో ఉందని ఫెడ్ రిజర్వ్ వెల్లడించింది. ప్రపంచ మార్కెట్ల పరిణామాలతో దేశీయ మార్కెట్లు డీలాపడ్డాయి. దీంతో వరుసగా మూడు రోజులపాటు లాభాలను నమోదు చేసిన ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై ఆందోళనతో, దేశీయంగానూ కరోనా కేసుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని, ఈ ఆందోళనల కారణంగానే మదుపర్లు అమ్మకాలు సిద్ధమయ్యారని మార్కెట్ నిపుణులు తెలిపారు.
ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 394.40 పాయింట్లను కోల్పోయి 38,220 వద్ద ముగియగా, నిఫ్టీ 96.20 పాయింట్ల నష్టంతో 11,312 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ అధికంగా క్షీనించగా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆటో స్వల్పంగా దిగజారాయి. ఇక, మీడియా, రియల్టీ, మెటల్ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడవ్వగా, మిగిలిన అన్ని సూచీలు నష్టాల్లో కదలాడాయి. అత్యధికంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, టైటాన్, రిలయన్స్, ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధికంగా నష్టపోయాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.02 వద్ద ఉంది.