- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vaman Rao హత్య కేసులో మరో సంచలనం
దిశ ప్రతినిధి, కరీంనగర్: హై కోర్టు అడ్వకేట్ వామన్‌రావు దంపతుల హత్య కేసులో అన్ని సంచలనాలే వెలుగుచూస్తున్నాయి. ఫిబ్రవరి 17న జరిగిన ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రజా సంఘాలు, అడ్వకేట్లు, ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ప్రభుత్వంపై విరుచుకపడ్డాయి. రోజుకో మలుపు తిరిగిన ఈ కేసులో అధికార పార్టీ నాయకుల ప్రత్యక్ష్య ప్రమేయం వెలుగులోకి వచ్చింది. వారిని అరెస్ట్ చేసిన క్రమంలో నేరాంగీకారం ద్వారా మరింత మంది నిందితులను అరెస్ట్ చేశారు.
అయితే ఈ కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్లు శ్రీను ప్రమేయం వెలుగులోకి రావడంతో పుట్ట మధు కేంద్రీకృతంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. వామన్ రావు తండ్రి కిషన్ రావు కూడా పుట్ట మధు, అతని భార్య శైలజలపై కేసు నమోదు చేయాలని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మార్చి మొదటి వారంలో ఓ సారి, ఇటీవల మరోసారి పుట్ట మధుతో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసి 90 రోజులు కావడంతో పోలీసులు రెండు రోజుల క్రితం ఆన్ లైన్‌లో ఛార్జి షీట్ దాఖలు చేసి గురువారం హార్డ్ కాపీని మంథని కోర్టులో సమర్పించారు. ఛార్జి షీట్ 163 పేజీల వరకు ఉండగా, అనుభందంగా ఉంచిన డాక్యూమెంట్ కలిపితే సుమారు 2 వేల పేజీల వరకూ ఉంటుందని తెలుస్తోంది.
భారీ సైజ్.. రికార్డే..
గట్టు వామన్ రావు, పివి నాగమణీల మర్డర్ కేసు ఛార్జీ షీట్ భారీ సైజులో ఉండడం విశేషం. ఇటీవల కాలంలో ఇంత పరిమాణంలో ఉన్న చార్జీ షీట్ రాష్ట్రంలో ఏ కేసులోనూ దాఖలు కాలేదు. 20 పేజీలకు మించి ఛార్జి షీట్‌ను పోలీసులు ఇప్పటి వరకు కోర్టులో సమర్పించలేదని, వామన్ రావు మర్డర్ కేసు వేసిన ఛార్జీ షీటే రికార్డుల్లోకి ఎక్కనుందని తెలుస్తోంది. వైఎస్ జగన్ పై సీబీఐ వేసిన ఛార్జిషీట్ తరువాత గట్టు వామన్ రావు మర్డర్ కేసు ఛార్జీ షీటే స్థానం దక్కించుకోనుందని అంటున్నారు.
సప్లిమెంటరీ వేస్తే..
గట్టు వామన్ రావు మర్డర్ కేసులో పోలీసులు సప్లిమెంటరీ ఛార్జీ షీట్ వేసే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ రామగుండం పోలీసులు ఈ కేసులో సప్లిమెంటరీ ఛార్జి షీట్ వేస్తే మరో అరుదైన కేసుగా నిలువనుంది. వైఎస్ జగన్ కేసులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జి షీట్లు వేసిన తరువాత మరో కేసులో మాత్రం సప్లిమెంటరీ ఛార్జి షీట్ వేయలేదు. ఇప్పుడు వామన్ రావు హత్యకు సంబందించిన కేసు విచారణలో అభియోగపత్రాలను రెండో విడుత కోర్టులో సమర్పిస్తే మాత్రం రాష్ట్రంలోనే మొట్టమొదటి కేసు కానుంది.