వ్యాక్సిన్ తీసుకున్నా సీనియర్ నటిని వదలని కరోనా

by Anukaran |   ( Updated:2021-04-08 00:17:57.0  )
వ్యాక్సిన్ తీసుకున్నా సీనియర్ నటిని వదలని కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తుంది. రోజు రోజుకు కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇక చిత్ర పరిశ్రమలో ఈ కరోనా కేసులు అధికమవడం అభిమానులను భయాందోళనకు గురి చేస్తుంది. తాజాగా మరో సీనియర్ నటి కరోనా బారిన పడ్డారు. టాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ నేత నగ్మా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు.

“ఇటీవలే కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నా.. కానీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. దయచేసి అందరు కరోనా జాగ్రత్తలు పాటించండి… మొదటి డోస్ తీసుకున్నా కూడా అందరు తప్పకుండా జాగ్రత్తలను పాటించండి. ప్రస్తుతం నేను హోమ్ క్వారెంటైన్ లో చికిత్స తీసుకుంటున్న” అంటూ ట్వీట్ చేశారు. ఇకపోతే నగ్మా ఏప్రిల్ 2 న ముంబైలో కరోనా మొదటి డోస్ తీసుకున్నారు. నగ్మా త్వరగా కోలుకోవాలని అభిమానులు, రాజకీయ ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story