అన్నవరం నుంచి ఢిల్లీకి తరలిస్తోన్న గంజాయి పట్టివేత

by Shyam |
cannabis Seize
X

దిశ, మద్దిరాల: గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని పొలుమల్ల గ్రామ శివారులో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ నర్సింగ వెంకన్న వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పొలుమల్ల గ్రామ శివారులోని 365 జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఢిల్లీకి చెందిన సౌరవ్, అమిత్ అనే ఇద్దరు వ్యక్తులు ఏపీలోని అన్నవరంలో 13 ప్యాకెట్ల గంజాయి(26కేజీలు) ఢిల్లీకి తరలిస్తుండగా ఖమ్మం జిల్లా మరిపెడ బంగ్లా ఎర్రపహాడ్ క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవి పరిశీలించారు.

Advertisement
Next Story