- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'సెహ్వాగ్ మరోదేశానికి ఆడుంటే 10 వేల పరుగులు దాటేవాడు'
దిశ స్పోర్ట్స్ :
భారత డాషింగ్ ఓపెనర్, మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ టీమ్ ఇండియా తరపున కాకుండా వేరే ఏ ఇతర జట్టుకు ఆడినా టెస్టుల్లో సులభంగా 10 వేల పరుగులు దాటేసేవాడని పాక్ మాజీ కెప్టెన్ లతీఫ్ రషీద్ అభిప్రాయపడ్డాడు. ‘ప్రత్యర్థి బౌలర్ల బౌలింగ్‌ను తుత్తునియలు చేసి.. వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సెహ్వాగ్‌లో ఎంతో టాలెంట్ దాగుంది. కానీ టీమ్ ఇండియాలో సచిన్, ద్రావిడ్ వంటి దిగ్గజాలు ఉండటం వల్లే సెహ్వాగ్ వారి వెనకే ఉండిపోయాడని’ లతీఫ్ అన్నాడు. తన టెస్టు కెరీర్‌లో 8 వేలకు పైగా పరుగులు చేసిన సెహ్వాగ్.. 4 వేల పైగా పరుగులు విదేశీ గడ్డపైనే చేయడం గమనార్హం. ‘సెహ్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన రికార్డులే అతని గురించి మాట్లాడతాయి. ఒక వేళ సెహ్వాగ్ వేరే దేశం తరపున ఆడుంటే టెస్టుల్లో తప్పకుండా 10 వేల పరుగులు పూర్తి చేసేవాడు’ అని లతీఫ్ చెప్పాడు.