- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిద్రలేమితో బాధపడ్డా : సీరత్ కపూర్
‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు తెరపై తళుక్కుమన్న తార సీరత్ కపూర్. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. లాక్‌డౌన్ వేళ సెలబ్రిటీలంతా ఇంటి పనులతో, చారిటీలతో బిజిబిజీగా గడుపుతుంటే సీరత్ కపూర్ మాత్రం నిద్రలేమితో బాధపడినట్లు చెబుతోంది.
‘లాక్‌డౌన్ తొలి రోజుల్లో నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. తరచుగా ఏవో ఊహలు చుట్టుముట్టేవి. నా మైండ్‌లో ఏవో శబ్దాలు వినిపించేవి. అవి ప్రతిధ్వనిలా వినిపిస్తూ.. నా నిద్రను దూరం చేసేవి. మెల్లిమెల్లిగా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డాను. అయితే లాక్‌డౌన్ ఎంత సింపుల్‌గా జీవించాలో నేర్పించింది. కరోనా వల్ల చాలా మంది హృదయాల్లో భయం నెలకొంది. ఈ సంక్షోభ సమయం త్వరగా ముగిసిపోవాలని’ నేను ప్రార్థిస్తున్నాను. అంతవరకు మనమంతా కలిసి కోవిడ్ 19 మహమ్మారితో పోరాడాలి’ అని సీరత్ తెలిపారు.
లాక్‌డౌన్ టైమ్‌లో సన్నబడేందుకు సీరత్.. ఎలక్ట్రో మజిల్ స్టిములేషన్ ట్రైనింగ్ తీసుకుంటోందట. ఈ ఖాళీ సమయంలో ఇంటి పనులు కూడా తనే చేస్తూ.. ప్రతిదీ శుభ్రం చేస్తున్నానని సీరత్ ఇటీవలే ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఆమె నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ విడుదలకు సిద్ధమవుతోంది.