ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..

by Shamantha N |
ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువతున్నాయి. ఆదివారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అల్ ఖైదా ఉగ్రవాదులు ఎయిర్‌పోర్టుపై దాడికి ప్లాన్ చేసినట్టు ఢిల్లీ పోలీసులకు ఈ మెయిల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎయిర్‌పోర్టు వద్ద భద్రతను పెంచారు.

అన్ని టెర్మినళ్ల వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రమాదకరంగా ఎలాంటి వస్తువుల లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. అల్​ఖైదా ఉగ్రవాదులు ఎయిర్​పోర్ట్‌లో బాంబు దాడికి ప్లాన్ చేస్తున్నట్టు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ఎయిర్​లైన్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు శనివారం సమాచారం ఇచ్చింది. కరణ్​బిర్ సూరి అలియాస్ మహమ్మద్ జలాల్, అతడి భార్య షేలీ శార్దా అలియాస్ హసీనా సింగపూర్ నుంచి భారత్​కు ఆదివారం వస్తున్నారని అందులో పేర్కొన్నారు.

1-3 రోజుల్లో బాంబు దాడి చేస్తామని బెదిరించారు. ఈ బెదిరింపులు అవాస్తవమని రాత్రి 7.18 గంటలకు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. అయితే, ఈ బెదిరింపులు అవాస్తవమని విచారణలో తేలినట్లు ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు(ఐజీఐ) అధికారిక ప్రకటనలో పేర్కొంది. బాంబు స్క్వాడ్ ఎయిర్​పోర్ట్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపింది. అయినా.. అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed